వాషింగ్టన్ : వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్లో కాల్పులు జరిపిన నిందితుడి మ్యానిఫెస్టోను ఓ రిపోర్టర్ తన ముందే చదవడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను రేపిస్ట్‌ను కాదని సీబీఎస్ ఇంటర్వ్యూలో తెలిపారు. షూటర్ తన మ్యానిఫెస్టోలో ట్రంప్ రేపిస్ట్ అని పేర్కొన్న భాగాన్ని రిపోర్టర్ తన ముందు చదివిన తర్వాత ట్రంప్ స్పందిస్తూ.. ‘నేను రేపిస్ట్‌ను కాను. నేనెవరినీ అత్యాచారం చేయలేదు’ అని ట్రంప్ పేర్కొన్నారు.
‘నిందితుడు మిమ్మల్ని ఉద్దేశించే అలా రాశాడా’ అని రిపోర్టర్ ప్రశ్నించినప్పుడు ట్రంప్ సహనం కోల్పోయారు. ‘క్షమించండి.. నేను బాలలపై లైంగిక దాడి చేసేవాడిని కాదు. మీరు ఓ రోగి రాసిన చెత్తను చదివారు. నాకు అలాంటి విషయాలతో సంబంధం లేదు. నేను నిర్దోషిని’ అని ట్రంప్ అన్నారు. నిందితుడి ఆరోపణలను చదివినందుకు సిగ్గుండాలని రిపోర్టర్‌పై ఆయన విరుచుకుపడ్డారు.