Nikki Haley | హమాస్‌ను మట్టుబెట్టండి : ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహును కోరిన నిక్కీ హేలీ
రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్ధులు నిక్కీ హేలీ (Nikki Haley), వివేక్ రామస్వామి సహా పలువురు ఇండో అమెరికన్లు ఈ సంక్లిష్ట సమయంలో ఇజ్రాయెల్‌కు బాసటగా నిలిచారు.
న్యూయార్క్ : ఇజ్రాయెల్-పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ మధ్య భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపు దాడులను ప్రముఖ ఇండో అమెరికన్లు తీవ్రంగా ఖండించారు. రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్ధులు నిక్కీ హేలీ (Nikki Haley), వివేక్ రామస్వామి సహా పలువురు ఇండో అమెరికన్లు ఈ సంక్లిష్ట సమయంలో ఇజ్రాయెల్‌కు బాసటగా నిలిచారు.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో ఇప్పటికే 1100 మందికి పైగా మరణించారు. మృతుల్లో పలువురు మహిళలు, చిన్నారులు ఉన్నారు. 1900 మందికి పైగా గాయాల పాలై వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక ఇజ్రాయెల్‌పై హమాస్ దాడిని ఖండించిన నిక్కీ హేలీ హమాస్ ఉగ్ర మూకలను మట్టుబెట్టాలని ఇజ్రాయెల్‌ను కోరారు.
ఇజ్రాయెల్, అమెరికాకు మరణశాసనం అంటూ హమాస్, వారికి వత్తాసు పలికిన ఇరాన్ నినదిస్తున్నాయని, ఇది తమకు గుర్తుంటుందని, హమాస్, హెజ్బొల్లా, హౌతీస్, ఇరానియన్లు తమను ద్వేషిస్తున్నందున తామంతా ఇజ్రాయెల్‌కు వెన్నుదన్నుగా నిలిచామని రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్ధి నిక్కీ హేలీ పేర్కన్నారు. ఇజ్రాయెల్‌కు ఇప్పుడు తమ సంఘీభావం ఎంతో అవసరమని, అందుకే తామంతా ఐక్యంగా ఇజ్రాయెల్ వెన్నంటి ఉంటామని ఆమె పేర్కొన్నారు. హమాస్‌ను మట్టుబెట్టాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును కోరుతూ నిక్కీ హేలీ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
Read More :
Telangana | రాష్ట్రంలో 35,356 పోలింగ్ కేంద్రాలు.. సగటున 897 మంది ఓటర్లు
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

