Digital Screens | న్యూఢిల్లీ: డిజిటల్ స్క్రీన్స్ (మొబైల్ ఫోన్లు, ల్యాప్‌ట్యాప్, ట్యాబ్, కంప్యూటర్లు)ను పెద్ద ఎత్తున వాడుతున్న కుటుంబాల్లోని పిల్లల్లో భాషా నైపుణ్యాలు దెబ్బతింటున్నాయని తాజా అధ్యయనం ఒకటి హెచ్చరించింది. పిల్లల మెదడు అభివృద్ధిపై వీడియో గేమ్స్ ప్రతికూల ప్రభావం చూపుతాయని ‘ఎస్తోనియా’ సైంటిస్టులు తెలిపారు. దీనిపై ‘ఫ్రాంటియర్ ఇన్ డెవలప్మెంటల్ సైకాలజీ’ కథనం ప్రకారం, రెండున్నర ఏండ్ల వయసు పిల్లలున్న తల్లిదండ్రుల నుంచి సేకరించిన సమాచారాన్ని సైంటిస్టులు విశ్లేషించారు. స్క్రీన్ టైమ్ తక్కువగా ఉన్న పిల్లలు.. పదజాలం, వ్యాకరణంలో అత్యధిక స్కోర్ చేయటం గమనార్హం. ఈ-బుక్స్ చదవటం, ఎడ్యుకేషనల్ గేమ్స్‌తో గడిపినా.. అది పిల్లలపై దుష్ఫ్రభావం చూపుతుందని అధ్యయనం తెలిపింది.
ఒత్తిడి వల్ల శుక్రకణాలు చలనశీలతను కోల్పోతాయని ఇప్పటివరకు చదువుకున్నాం. పునరుత్పత్తి వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలుసు. కానీ, ఒత్తిడిని జయించిన తర్వాత శుక్రకణాల్లో వేగం పెరుగుతుందని, పునరుత్పత్తి వ్యవస్థలో అండంతో ఫలదీకరణం ఆశాజనకంగా జరుగుతుందని తాజా అధ్యయనం తేల్చింది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో అన్‌స్చుట్జ్ మెడికల్ క్యాంపస్ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో.. ఒత్తిడిని జయించిన తర్వాత శుక్రకణాల చలనం ఆరోగ్యవంతంగా ఉన్నట్టు తెలిసింది. దాని ఫలితంగా జననాల రేటులో వృద్ధి కనిపించిందని పరిశోధకులు వివరించారు.