ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ టిక్‌టాక్ కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టబోతోంది. ఈ వీడియో యాప్ దిగ్గజం త్వరలోనే ఫుడ్ డెలివరీ రంగంలో తన కార్యకలాపాలు ప్రారంభించబోతున్నట్లు 9To5Mac అనే సంస్థ తన నివేదికలో తెలిపింది. అయితే ఫుడ్ డెలివరీలో.. వైరల్ అవుతున్న ప్రత్యేక ఫుడ్ రెసిపీలు కూడా అందుబాటులో ఉంటాయని సమాచారం.
టిక్‌టాక్ కిచెన్ పేరిట మొదలయ్యే ఈ కొత్త బిజినెస్ యాప్ ముందుగా.. అమెరికాలో ప్రారంభంకానుంది. నివేదిక ప్రకారం అక్కడ దాదాపు 300లకు పైగా ప్రాంతాల్లో ఈ ఫుడ్ డెలివరీ సేవలు అందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ తరువాత మొత్తం 1000 ప్రాంతాలలో ఈ ప్రత్యేక ఫడ్ డెలివరీ సేవలను కంపెనీ విస్తరించనుంది.