ఫిలడెల్ఫియా, జూన్ 5: అమెరికాలో మళ్లీ కాల్పులు చోటుచేసుకున్నాయి. ఫిలడెల్ఫియాలో శనివారం రాత్రి కొందరు వ్యక్తులు కాల్పులు జరుపడంతో ముగ్గురు మరణించారు. 11 మందికి గాయాలయ్యాయి. వినోదానికి పేరుగాంచిన ఫిలడెల్ఫియా లో వారాంతం సందర్భంగా పార్టీలు చేసుకుంటుంటారు.
ఇదే అదునుగా భావించిన కొందరు దుండగులు విచక్షణారాహితంగా కాల్పులు జరుపడంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. అయితే కాల్పులు జరుగుతున్న సమయంలో పోలీసులు అదే ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తుండటం గమనార్హం.