ఈ ఫ్రిడ్జ్‌కు అసలు విద్యుత్తే అవసరం లేదు.. మరెలా పనిచేస్తుంది? ఓసారి లుక్కేయండి..

హైదరాబాద్ : త్రీ స్టార్.. ఫైవ్ స్టార్.. మనం ఫ్రిడ్జ్‌లు కొనేముందుకు ఇవన్నీ చూస్తుంటాం. కరెంటు బిల్లును ఆదా చేసేందుకు ఆ రకమైన ఫ్రిడ్జ్‌లను వాడుతుంటాం. కానీ మీరు చూస్తోంది గ్రౌండ్ ఫ్రిడ్జ్. దీనికి అసలు విద్యుత్తే అవసరం లేదు. స్వచ్ఛమైన పర్యావరణాన్ని కోరుకునేవారికి ఈ ఫ్రిడ్జ్ చాలా అనుకూలంగా ఉంటుంది. భూమిలోపల ఉండే ఈ ఫ్రిడ్జ్ కోసం ఓ సొరంగాన్ని తొవ్వాల్సి ఉంటుంది. డచ్ కంపెనీ ఇలాంటి ఫ్రిడ్జ్‌లను తయారు చేస్తున్నది. దీని ధర మన కరెన్సీలో 15 లక్షలుగా ఉంది. గ్రౌండ్ఫ్రిడ్జ్ పేరుతో దీన్ని మార్కెట్లోకి రిలీజ్ చేశారు. మద్యం సీసాలు, కూరగాయలు, పండ్లు వీటిలో స్టోర్ చేసుకోవచ్చు. దీని కెపాసిటీ 3 వేల లీటర్లు ఉన్నట్లు ఆ కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఒకరకంగా ఇది 20 కుటుంబాలకు కలిసి వచ్చే రీతిలో పనిచేస్తుంది. గ్రౌండ్ఫ్రిడ్జ్ ఇంటీరియర్ లో వైట్ పెయింట్ వేశారు. దీని వల్ల దాంట్లో లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది.

ఇక ఆ ఫ్రిడ్జ్‌కు బయట మాత్రం గ్రీన్ కలర్ వేశారు. దీని వల్ల ఆ ఫ్రిడ్జ్ గార్డెన్లో కలిసిపోయినట్లుగా దర్శనమిస్తుంది. భారీ గోళాకారంలో ఉన్న ఫ్రిడ్జ్‌లో నాలుగు షెల్వ్స్ ఉన్నాయి. వాటిల్లో ఆహారాన్ని స్టోర్ చేసుకోవచ్చు. అయితే బయట తగిలే సూర్యరశ్మి వల్ల.. ఫ్రిడ్జ్‌లో లోపల టెంపరేచర్లు మారుతుంటాయి. నేల రకం, గ్రౌండ్‌వాటర్ వల్ల కూడా ఫ్రిడ్జ్ పనితీరు మారుతుంది. భూమి లోపల ఫ్రిడ్జ్‌కు చల్లటి గాలిని అందించేందుకు దానికి బ్యాటరీలను అమర్చారు. ఫ్రిడ్జ్ లోపల 50 డిగ్రీల ఫారెన్‌హీట్ టెంపరేచర్ ఉంటుంది. ఇక ఈ ఫ్రిడ్జ్‌ను ఇన్స్టాల్ చేయాలనుకుంటే.. కనీసం ఏడు అడుగుల లోతు.. 8×8 అడుగులు వెడల్పు తొవ్వాల్సి ఉంటుంది. మీకు గార్డెన్ ఉంటే.. ఈ ఫ్రిడ్జ్ ట్రై చేయండి.

Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | తమ్ముడిగా భావించి వదిలేయండి.. దిల్జీత్ దోసాంజ్ వివాదానికి అభిజీత్ దిప్కే ఫుల్స్టాప్!
Singur Drinking Water | సింగూరు ప్రత్యామ్నాయ తాగునీటి ఏర్పాట్ల కోసం రూ.120 కోట్లు మంజూరు
Shashi Tharoor: ఇందిరా గాంధీని ఇంటర్వ్యూ చేసిన శశిథరూర్.. ఆనాటి ఫోటో షేర్ చేసిన కాంగ్రెస్ ఎంపీ
Satyavathi Rathod | సత్యవతి రాథోడ్‌కు కేటీఆర్ బర్త్ డే విషెస్.. వీడియో
GLP-1 Medicine | మార్కెట్లో కుప్పలు కుప్పలుగా కల్తీ జీఎల్పీ-1 మందులు.. అమెరికా ఎఫ్‌డీఏ హెచ్చరికలు..
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

