Aspartame| న్యూఢిల్లీ: సాఫ్ట్‌డ్రింక్స్ తయారీలో వినియోగించే ఆర్టిఫిషియల్ స్వీట్నర్ ‘ఆస్పర్టేమ్’తో క్యాన్సర్ తలెత్తే ప్రమాదం ఉన్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది. అయితే రోజువారీ వినియోగ మోతాదులో ఎలాంటి మార్పు చేయలేదు. ‘కంపెనీలు తమ ఉత్పత్తులను వెనక్కి తీసుకోవాలని మేం చెప్పడం లేదు. అలాగే వినియోగదారులు మొత్తంగా ఆస్పర్టేమ్ను వాడొద్దని కూడా సూచించడం లేదు’ అని డబ్ల్యూహెచ్‌వో న్యూట్రిషన్ అండ్ ఫుడ్ సేఫ్టీ డైరెక్టర్ ఫ్రాన్సెస్కో తెలిపారు. అధిక మోతాదులో వాడొద్దని మాత్రమే తాము సూచిస్తున్నామని చెప్పారు.
ఆస్పర్టేమ్ను క్యాటగిరీ 2బీలో చేర్చిన డబ్ల్యూహెచ్‌వో.. ఈ కృత్రిమ చక్కెరను అతిగా వాడడం వల్ల కాలేయ క్యాన్సర్ బారిన పడే ముప్పు ఉన్నదని తెలిపింది. ఆస్పర్టేమ్ను డైట్డ్రింక్స్, చూయింగ్ గమ్, ఐస్‌క్రీమ్, టూత్‌పేస్ట్ తదితర వాటిల్లో వినియోగిస్తారు. చక్కెరకు ప్రత్యామ్నాయంగా వినియోగించే ఆర్టిఫిషియల్ స్వీటనర్స్తో బరువు ఏమీ తగ్గరని, పైగా అనారోగ్యం బారిన పడతారని డబ్ల్యూహెచ్‌వో గత మేలో పేర్కొన్నది.