Japan | జపాన్ను వణికించిన భూకంపం.. పలువురికి గాయాలు
Japan | ఆదివారం తెల్లవారుజామున టోక్యోతో సహా తూర్పు జపాన్‌లో సంభవించిన శక్తివంతమైన భూకంపం (Japan Earthquake )ప్రజలను భయాందోళనలకు గురిచేసింది.
Japan | ఆదివారం తెల్లవారుజామున టోక్యోతో సహా తూర్పు జపాన్‌లో సంభవించిన శక్తివంతమైన భూకంపం (Japan Earthquake )ప్రజలను భయాందోళనలకు గురిచేసింది. టోక్యో ప్రాంతంతో సహా తూర్పు జపాన్‌లో 5.9 ప్రాథమిక తీవ్రతతో ఒక మోస్తరు భూకంపం సంభవించిందని, దీనివల్ల కనీసం 30 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. దక్షిణ బరాబకి ప్రిఫెక్చర్లో సముద్రమట్టం నుంచి 70 కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. భూకంపం కారణంగా టోక్యో, నరిటా విమానాశ్రయం మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పాటు, ఈశాన్య ప్రాంతాలకు సేవలు అందించే ఇతర స్థానిక సర్వీసులకు అంతరాయం ఏర్పడింది.
అయితే, షింకన్సెన్ బుల్లెట్ రైళ్లు మాత్రం యధావిధిగా నడుస్తున్నాయని ఈస్ట్ జపాన్ రైల్వే కంపెనీ తెలిపింది. టోక్యోలోని కొన్ని ప్రాంతాలలో భూగర్భ నీటి పైపులు పగిలిపోయాయి. వందలాతి ఒండ్లలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భూకంప ప్రభావంతో పలు చోట్ల రోడ్లు, వంతెనలు, భవనాలు దెబ్బతిన్నాయని జపాన్ ప్రధాన మంత్రి సనాయి తకాయిచి ఎక్స్ వేదికగా తెలిపారు. జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి ప్రభుత్వం ఒక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసిందని ఆమె పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | ఢిల్లీ పోలీసులు ఎక్కడ అడ్డుకుంటే.. అక్కడ నిరసనలు కొనసాగించండి: అజింక్య షిండే
INDIA bloc | సీఈసీ రాజీనామా డిమాండ్ మరింత ఉధృతం.. సోమవారం భారీ నిరసనకు సిద్ధమైన ఇండియా బ్లాక్
AB de Villiers | వయసు పైబడినా చేవ తగ్గలే.. 37 బంతుల్లోనే డివిలియర్స్ శతకమోత..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడు ఈదురు జనార్ధన్ కుటుంబానికి అండగా కేటీఆర్.. వీడియో
KTR Letter | రేడియల్ రోడ్ 2 టెండర్లలో జరిగిన రూ. 3,296 కోట్ల కుంభకోణంపై సమాధానం చెప్పాలి : రేవంత్‌కు కేటీఆర్ లేఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

