Wooden Building | సిడ్నీ, అక్టోబర్ 5: ప్రపంచంలోనే అతి ఎత్తైన చెక్క భవనం పశ్చిమ ఆస్ట్రేలియాలోని దక్షిణ పెర్త్‌లో నిర్మాణం కానున్నది. ఈ హైబ్రీడ్ టవర్‌ను 42 శాతం మాస్ టింబర్‌తో 191.2 మీటర్ల ఎత్తుతో నిర్మించనున్నారు.
కార్బన్ డయాక్సైడ్ మొత్తం ఉద్గారాల్లో 8 శాతం సిమెంట్ నుంచి వెలువడుతున్నాయని.. ఈ నేపథ్యంలో చెక్క లాంటి సామగ్రితో భవనాలు నిర్మించడం వల్ల పర్యావరణంపై పడే ప్రభావాన్ని తగ్గించవచ్చని యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్‌వేల్స్ ప్రొఫెసర్ ఫిలిప్ ఓల్డ్‌ఫీల్డ్ తెలిపారు.