బీజింగ్: ప్రపంచంలో అత్యంత వేగంగా ప్రయాణించే రైలు ప్రయోగ దశలో గరిష్ఠంగా గంటకు 896 కి.మీ. వేగాన్ని అందుకుంది. గతంలో జపాన్ తయారు చేసిన మాగ్లెవ్ రైలు ఎల్ఓ సిరీస్ ప్రయోగాల దశలో గంటకు 603 కి.మీ. వేగంతో ప్రయాణించి, రికార్డు సృష్టించింది. ఈ రికార్డును సీఆర్450 చెరిపేసింది. కమర్షియల్ స్పీడ్ గంటకు 400 కి.మీ. ఉండాలనే లక్ష్యంతో సీఆర్450ని రూపొందించారు.
ప్రస్తుతం సేవలందిస్తున్న సీఆర్400 ఫక్సింగ్ రైళ్లు గంటకు 350 కి.మీ. వేగంతో నడుస్తున్నాయి. సీఆర్450ని చైనా అకాడమీ ఆఫ్ రైల్వే సైన్సెస్ అభివృద్ధి చేసింది. కమర్షియల్ ప్యాసింజర్ సర్వీస్ కోసం అనుమతులు పొందాలంటే, ట్రయల్ రన్లో కనీసం 6 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించవలసి ఉంటుంది. ప్రయోగ పరీక్షలు చివరి దశలో ఉన్నట్లు ‘సైన్స్ అండ్ టెక్నాలజీ’ తెలిపింది.
మోటార్ వైండింగ్స్లో షార్ ్టసర్క్యూట్ జరిగితే, మోటార్ ఆగిపోదని చైనా రైల్వే అకాడమీ చీఫ్ ఇంజినీర్ ఝావో హోంగ్వెయి చెప్పారు. దీనివల్ల రైలు కార్యకలాపాల భద్రతకు ముప్పు ఎదురవుతుందన్నారు.