వాషింగ్టన్: ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్-2025గా ‘రేజ్ బైట్’ అనే పదం ఎంపికైంది. మూడు రోజులపాటు పబ్లిక్ ఓటింగ్ చేపట్టి ఈ పదాన్ని ఎంపికచేసినట్టు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ సోమవారం ప్రకటించింది.
రేజ్ బైట్లో.. రేజ్ అంటే కోపం, ఆగ్రహం. బైట్ అంటే ఎర. ఆన్లైన్లో ఎవరినైనా రెచ్చగొడుతూ, ఆగ్రహంతో చిందులు తొక్కేలా చేయడాన్ని ‘రేజ్ బైట్’ అంటారు.