Alef Aeronautics | ఎగిరే కారును అభివృద్ధిచేస్తున్న అమెరికా కంపెనీ.. అడ్వాన్స్ బుకింగ్స్ షురూ
నగరాల్లో ట్రాఫిక్ సమస్యలతో విసిగిపోయారా? చందమామ కథల్లో చదివినట్టు రెక్కల గుర్రం ఉంటే ఎంచక్కా గాల్లో ఎగురుకుంటూ గమ్యస్థానానికి చేరుకోవచ్చని అనుకుంటున్నారా? అయితే మీ కల త్వరలో నిజం కాబోతున్నది. ఎగిరే కారు మార్కెట్లోకి రాబోతున్నది.
- రోడ్డుపై, గాల్లోనూ దూసుకుపోగలదు
- అభివృద్ధి చేస్తున్న అమెరికా కంపెనీ
Alef Aeronautics | కాలిఫోర్నియా, అక్టోబర్ 1: నగరాల్లో ట్రాఫిక్ సమస్యలతో విసిగిపోయారా? చందమామ కథల్లో చదివినట్టు రెక్కల గుర్రం ఉంటే ఎంచక్కా గాల్లో ఎగురుకుంటూ గమ్యస్థానానికి చేరుకోవచ్చని అనుకుంటున్నారా? అయితే మీ కల త్వరలో నిజం కాబోతున్నది. ఎగిరే కారు మార్కెట్లోకి రాబోతున్నది. రోడ్డుపై దూసుకుపోతూ.. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న చోట పక్షిలా రివ్వున గాల్లో ఎగిరిపోయే కారు అందుబాటులోకి రానున్నది. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన అలెఫ్ ఏరోనాటిక్స్ కంపెనీ ఈ తరహా కారును అభివృద్ధి చేసింది. తాజాగా డెట్రాయిట్లో నిర్వహించిన ఆటో షోలో దీన్ని ప్రదర్శించారు.
ముందస్తు బుకింగ్లే 500..
ఈ ఏడాది జూన్లో అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఈ కారుకు అనుమతులు మంజూరు చేసింది. ఇందులో ఇద్దరు ప్రయాణించవచ్చు. దీని ధర సుమారు రూ.2.46 కోట్లు. విద్యుత్తు శక్తితో నడిచే ఇది రోడ్డుపై 200 మైళ్ల వరకు ప్రయాణించగలదు. గాల్లో అయితే 110 మైళ్ల వరకు ఎగరగలదు. ఈ కారులో నుంచి 180 డిగ్రీల కోణంలో చూసే వెసులుబాటు ఉంది. అలెఫ్ ఏరోనాటిక్స్ కంపెనీ 2022లోనే ఈ కార్లను ముందస్తు బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించగా.. ఇప్పటివరకు 500 వరకు బుక్ అయ్యాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

