ఫునఫుటి: తువాలు.. ప్రపంచంలోని అతి సుందరమైన దీవుల్లో ఒకటి. ఈ దీవి త్వరలో అద్యశ్యం కానుంది. పశ్చిమ మధ్య పసిఫిక్ సముద్రంలోని ద్వీప దేశమైన తువాలు జనాభా 12 వేలు. అయితే ఇటీవల సముద్ర మట్టం బాగా పెరుగుతుండటంతో ఈ ద్వీప దేశం కొద్ది కాలానికి నీట మునిగి అదృశ్యం అవుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
ఈ దేశంలోని తొమ్మిది దీవులలో రెండు ఇప్పటికే నీట మునగడాన్ని వీరు ప్రస్తావిస్తున్నారు. ఇది సముద్ర మట్టానికి కేవలం 2 మీటర్ల ఎత్తులోనే ఉందని, అయితే సముద్ర జలాల మట్టం మాత్రం ఏడాదికి 3.2 మిల్లీమీటర్ల వంతున ఎత్తు పెరుగుతున్నదని వారు తెలిపారు.