వాషింగ్టన్, సెప్టెంబర్ 10: సూర్యకాంతిని ఉపయోగించుకొని మొక్కలు..కార్బన్ డయాక్సైడ్, నీటిని ఆహారంగా మార్చినట్టు.. విస్తారమైన సౌరశక్తి నుంచి ఇంధనాన్ని తయారుచేయటంలో అమెరికా సైంటిస్టులు సరికొత్త ప్రక్రియను కనుగొన్నారు. కార్బన్ డయాక్సైడ్ను ఇంధనంగా మార్చటంలో అమెరికాలోని ‘సెంటర్ ఫర్ హైబ్రిడ్ అప్రోచెస్ ఇన్ సోలార్ ఎనెర్జీ’ (చేజ్) సెంటర్ పరిశోధకుల ప్రయోగాలు సక్సెస్ అయ్యాయి.
సిలికాన్ ఫొటో ఎలక్ట్రోడ్స్‌పై కాంతిని ప్రసరింపజేయగా, నీటి సమక్షంలో కార్బన్ డయాక్సైడ్ నుంచి మిథనాల్‌ను ఉత్పత్తి చేసినట్టు శాస్త్రవేత్తలు వెల్లడించారు. దీనిని సైంటిస్టులు ద్రవరూపంలోని సౌర ఇంధనంగా పేర్కొన్నారు.