వాషింగ్టన్: విదేశీ విద్యార్థుల వీసాల విషయంలో హార్వర్డ్ విశ్వవిద్యాలయంతో వివాదంపై కోర్టు ఆదేశాలను జాప్యం చేయడం కోసం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ప్రయత్నిస్తున్నది. ఫెడరల్ కోర్టులో విచారణ ప్రారంభమవడానికి కొద్ది సేపటి ముందు ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గురువారం హార్వర్డ్ వర్సిటీకి ఓ లేఖను పంపించారు.
స్టూడెంట్ అండ్ ఎక్సేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ కింద ఈ విశ్వవిద్యాలయానికి సర్టిఫికేషన్‌ను రద్దు చేయడాన్ని సవాల్ చేయడానికి 30 రోజుల గడువు ఇస్తున్నట్లు తెలిపారు.