అమెరికాలో తగ్గిన వలస జనాభా.. ట్రంప్ చర్యలే కారణం
అమెరికాలో 1960వ దశకం తర్వాత మొట్టమొదటిసారి వలసదారుల జనాభా గణనీయంగా తగ్గినట్లు ప్యూ రిసెర్చ్ సెంటర్ వెల్లడించింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేపట్టిన కఠిన ఇమిగ్రేషన్ చర్యలే ఇందుకు కారణమని తేలింది.
- ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం
న్యూఢిల్లీ, ఆగస్టు 23: అమెరికాలో 1960వ దశకం తర్వాత మొట్టమొదటిసారి వలసదారుల జనాభా గణనీయంగా తగ్గినట్లు ప్యూ రిసెర్చ్ సెంటర్ వెల్లడించింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేపట్టిన కఠిన ఇమిగ్రేషన్ చర్యలే ఇందుకు కారణమని తేలింది. ఈ ఏడాది జనవరి-జూన్ మధ్య అమెరికాలో దాదాపు 15 లక్షల మంది వలసదారులు తగ్గారని, దీంతో దేశంలో ఉన్న మొత్తం వలసదారుల జనాభా 5.19 కోట్లకు తగ్గిపోయిందని అధ్యయన నివేదిక పేర్కొంది. ఇమిగ్రేషన్ నిబంధనలను కఠినంగా అమలుచేయడం, సామూహిక దేశ బహిష్కరణలు, చట్టపరమైన ఎంట్రీ రూట్లలో వచ్చేవారి సంఖ్య తగ్గడం వంటివి వలసదారుల సంఖ్య తగ్గడానికి కారణమని నివేదిక తెలిపింది. అయితే దేశంలో జనాభా తగ్గడం వల్ల తలెత్తే ఆర్థికపరమైన పరిణామాలను కూడా నివేదిక ప్రస్తావించింది.
దేశంలోని కార్మిక శక్తిలో 7.50 లక్షల వలసదారులు తగ్గడం వల్ల అది ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిస్తోందని, ముఖ్యంగా వలస కార్మికులపై ఆధారపడిన పరిశ్రమలలో దీని ప్రభావం కనిపిస్తోందని నివేదిక పేర్కొంది. స్థానికంగా పనిచేసే వయసున్న కార్మికుల సంఖ్య పెరగకపోవడం వల్ల వలస కార్మికులే పరిశ్రమలకు ప్రధాన వనరుగా ఉన్నారని ప్యూ రిసెర్చ్ సెంటర్కు చెందిన సీనియర్ సభ్యుడు జెఫ్రీ పజల్ పేర్కొన్నారు. వలస కార్మికులు తగ్గిపోవడం వల్ల ఆర్థిక ప్రగతి, ఉత్పాదకత పడిపోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.
ట్రంప్ తీసుకున్న కఠిన చర్యల వల్ల అక్రమ వలసదారుల జనాభా గణనీయంగా తగ్గిపోయింది. 2023లో వీరి జనాభా 1.40 కోట్లకు చేరుకుంది. కాగా, అమెరికాలో వలసదారుల సంఖ్య తగ్గుముఖం పట్టినప్పటికీ ఇప్పటికీ అత్యధికంగా వలసదారుల జనాభా ఉన్న దేశంగా అమెరికా అగ్రస్థానంలో ఉంది. అమెరికా జనాభాలో వలసదారుల వాటా జూన్ నాటికి 15.8 శాతం నుంచి 15.4 శాతానికి తగ్గింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

