జకార్తా, అక్టోబర్ 28: ఇండోనేషియాకు చెందిన 12 ఏండ్ల బాలుడి పేరు ఇంటర్నెట్లో మార్మోగుతున్నది. ఈ పేరు రావడానికి కారణం అతని పేరే! ఏబీసీడీఈఎఫ్ జీహెచ్ఐజేకే జుజు… ఇదే అతని పేరు. ఈ నెల 21న కరోనా టీకా వేయించుకునే సమయంలో ఆ పిల్లవాడు తన పేరు చెప్పడంతో ఆశ్చర్యపోవడం అధికారుల వంతైంది. గుర్తింపు కార్డుతో పాటు దుస్తులపై కుట్టిన నేమ్ ట్యాగ్‌ను చూపిస్తే కానీ అధికారులు నమ్మలేదు. అప్పటి నుంచి అతని చిత్రమైన పేరు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నది. క్రాస్‌వర్డ్ పజిల్స్ అంటే తనకు ఇష్టమని, అందుకే తన కొడుక్కి విలక్షణమైన పేరు పెట్టానని జుజు తండ్రి తెలిపాడు. జుజుకి ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. వారి పేర్లు- ఎన్వోపీక్యూ ఆర్ఎస్టీయూవీ; ఎక్స్‌వైజెడ్.