Cambodia-Thailand | థాయ్ లాండ్, కంబోడియా (Cambodia-Thailand) మధ్య గత ఐదురోజులుగా కొనసాగుతున్న సరిహద్దు ఉద్రిక్తతలకు తెరపడింది. కాల్పుల విరమణకు రెండు దేశాలూ అంగీకరించాయి. దీంతో రెండు దేశాల మధ్య నెలకొన్ని ఘర్షణలకు తెరపడినట్లైంది. రెండు దేశాలూ తక్షణ, బేషరతుగా కాల్పుల విరమణకు అంగీకరించినట్లు మలేషియా (Malaysia) ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం (Anwar Ibrahim) ప్రకటించారు.
రెండు దేశాల మధ్య నెలకొన్న వివాదంలో మలేషియా మధ్యవర్తిత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. థాయ్‌లాండ్, కంబోడియా దేశాలు కాల్పుల విరమణ చర్చలకు అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే ప్రకటించారు. ఈ నేపథ్యంలో మలేషియా ప్రధాని ఇబ్రహీం ఆహ్వానం మేరకు సోమవారం మలేషియాలోని పుత్రజయలో జరిగిన చర్చలకు కంబోడియా ప్రధాన మంత్రి హున్ మానెట్, థాయ్‌లాండ్ తాత్కాలిక ప్రధాని ఫుమ్తామ్ వెచాయాచాయ్ హాజరయ్యారు. మలేషియాలోని చైనా, అమెరికా రాయబారులతో కలిసి మలేషియా ప్రధాని ఇబ్రహీం నివాసంలో చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో తక్షణ కాల్పుల విరమణకు రెండు దేశాలూ అంగీకరించాయి.
థాయ్‌లాండ్, కంబోడియా మధ్య గురువారం నుంచి ఘర్షణలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ ఘర్షణల్లో 35 మందికిపైగా మరణించారు. 1.65 మంది నిరాశ్రయులయ్యారు. ఘర్షణ పడుతున్న రెండు దేశాలతోపాటు 10 ఆగ్నేయాసియా దేశాలతో కూడిన ప్రాంతీయ సంఘం ఆసియన్‌కి సారథ్యం వహిస్తున్న మలేషియా కాల్పుల విరమణ జరపాలని ఇరు దేశాలకు పిలుపునిచ్చింది.
Also Read..
Mass Shooting | బ్యాంకాక్‌లో కాల్పులు.. ఆరుగురు మృతి
US-EU Trade Deal | ఈయూ-అమెరికా మధ్య కుదిరిన బిగ్ ట్రేడ్ డీల్