e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, May 18, 2021
Home News ఎల‌న్ మస్క్‌కు వార్నింగ్ ఇచ్చిన కార్మిక శాఖ‌

ఎల‌న్ మస్క్‌కు వార్నింగ్ ఇచ్చిన కార్మిక శాఖ‌

ఎల‌న్ మస్క్‌కు వార్నింగ్ ఇచ్చిన కార్మిక శాఖ‌

కాలిఫోర్నియా: టెస్లా ఎల‌క్ట్రిక్ కార్ల కంపెనీ సీఈవో ఎల‌న్ మ‌స్క్‌కు అమెరికా కార్మిక శాఖ వార్నింగ్ ఇచ్చింది. కంపెనీ ఉద్యోగుల సంఘానికి వ్య‌తిరేకంగా చేసిన ట్వీట్‌ను డిలీట్ చేయాల‌ని కార్మిక శాఖ త‌న ఆదేశాల్లో పేర్కొన్న‌ది. యూనియ‌న్‌కు వ్య‌తిరేకంగా 2018లో మ‌స్క్ ఓ ట్వీట్ చేశార‌ని, ఆ ట్వీట్ అక్ర‌మం అని, దాన్ని త‌క్ష‌ణ‌మే డిలీట్ చేయాల‌ని అమెరికా నేష‌న‌ల్ లేబ‌ర్ రిలేష‌న్స్ బోర్డు గురువారం పేర్కొన్న‌ది. లేబ‌ర్ రిలేష‌న్స్ చ‌ట్టాన్ని మ‌స్క్ అతిక్ర‌మించిన‌ట్లు 2019లో ఓ జ‌డ్జి త‌న తీర్పులో పేర్కొన్నారు. ఆ తీర్పును లేబ‌ర్ కోర్టు స‌మ‌ర్థించింది. త‌మ కంపెనీలో ఉద్యోగ యూనియ‌న్లు చెల్ల‌వు అని, అలా యూనియ‌న్ పెడితే వ‌ర్క‌ర్ల‌కు స్టాక్ ఆప్ష‌న్లు ఇవ్వ‌మ‌ని ఓ ట్వీట్ మ‌స్క్ హెచ్చ‌రించాడు. ఆ హెచ్చ‌రిక‌ల‌ను లేబ‌ర్ కోర్టు త‌ప్పుప‌ట్టింది. తొల‌గించిన యూనియ‌న్ ఉద్యోగిని కూడా మ‌ళ్లీ విధుల్లోకి చేర్చుకోవాల‌ని కోర్టు చెప్పింది. ఫ్రీమంట్‌లో ఉన్న కంపెనీ ప్లాంట్ ఉద్యోగులు అప్ప‌ట్లో యూనియ‌న్‌గా మారేందుకు ప్ర‌య‌త్నించారు. దాన్ని మ‌స్క్ అడ్డుకున్నారు. ఈ నేప‌థ్యంలో యునైటెడ్ ఆటో వ‌ర్క‌ర్లులు 2018లో కోర్టును ఆశ్ర‌యించారు.

Advertisement
ఎల‌న్ మస్క్‌కు వార్నింగ్ ఇచ్చిన కార్మిక శాఖ‌
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement