Elon Musk | న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ టెస్లా బాస్ ఎలాన్ మస్క్ బంపరాఫర్ ప్రకటించారు. భావ ప్రకటనా స్వేచ్ఛ, ఆయుధ హక్కుకు మద్దతునిచ్చే పిటిషన్‌పై సంతకం చేసే నమోదిత ఓటర్లు ప్రతి ఒక్కరికీ 47 డాలర్ల చొప్పున ఇవ్వనున్నట్టు ప్రకటించారు. అయితే, ఈ ఆఫర్ స్వింగ్ స్టేట్స్ (రెండు ప్రధాన రాజకీయ పార్టీలకు సమాన మద్దతు కలిగిన రాష్ర్టాలు) ఓటర్లకు మాత్రమే పరిమితం. యూఎస్ అధ్యక్ష ఎన్నికల్లో రెండోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ట్రంప్‌కు మద్దతుగా పలువురు టెక్ వ్యవస్థాపకులతో ఏర్పడిన మస్క్ అమెరికా పీఏసీ వెబ్సైట్లో ఈ పిటిషన్‌ను ప్రారంభించారు.