పారిస్, అక్టోబర్ 14: ఫ్రాన్స్‌లో మరోసారి ఉగ్రదాడి జరిగింది. అర్రాస్ పట్టణంలోని స్కూల్ టీచర్‌పై ఓ ఉగ్రవాది కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశాడు. శుక్రవారం జరిగిన ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారు.
ఈ ఘటనతో మతపరమైన అల్లర్లు చెలరేగేందుకు అవకాశముందన్న అంచనాతో మేక్రాన్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించింది. అధ్యక్షుడు మేక్రాన్ శనివారం ఘటనా స్థలానికి వెళ్లారు. ‘అత్యంత అనాగరికమైన చర్య’గా దాడి ఘటనను ఖండించారు. ఈ ఘటనకు ఇజ్రాయిల్-హమాస్‌కు యుద్ధానికి సంబంధముందని హోంమంత్రి గెరాల్డ్ దర్మానిన్ చెప్పడం గమనార్హం.