కాబూల్: ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు ( Taliban ) ఇంట్లింట్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. గతంలో నాటో దళాలకు పనిచేసిన వారి కోసం గాలింపు చేపడుతున్నారు. వారి కుటుంబసభ్యులను తాలిబన్లు బెరిస్తున్నట్లు యూఎన్ చెప్పింది. ఎటువంటి ప్రతీకారం తీర్చుకోమని తాలిబన్లు చెప్పినా.. ప్రస్తుతం ఆ మిలిటెంట్లు మానవవేట కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగతంగా కొందర్ని తాలిబన్లు టార్గెట్ చేస్తున్నారని, ఆ బెదిరింపులు స్పష్టంగా కనిపిస్తున్నాయని రిప్టో నార్వేయన్ సెంటర్ తన నివేదికలో తెలిపింది. అమెరికా బలగాలు ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్న సమయంలో.. నాటో దళాలు కూడా తాలిబన్ల అరాచకాలను నిలువరించాయి. ప్రస్తుతం నాటో దళాలు ఆ దేశం నుంచి వెళ్లిపోయిన నేపథ్యంలో వారికి సహకరించిన వారి కోసం తాలిబన్లు అన్వేషిస్తున్నారు. వాళ్లకు వాళ్లుగా లొంగిపోతే ఏమీ చేయమని, లేదంటే వాళ్లను పట్టుకుని విచారించి, వారి కుటుంసభ్యులను శిక్షిస్తామని యూఎన్ తన రిపోర్ట్‌లో తెలిపింది.