తైవాన్ డిఫెన్స్ జోన్లోకి చొరబడిన 39 చైనా విమానాలు

తైవాన్: తైవాన్ గగనతలంలోకి చైనా విమానాలు చొరబడ్డాయి. శనివారం తైవాన్ ఎయిర్ డిఫెన్స్ జోన్లోకి సుమారు 39 చైనా సైనిక విమానాలు ప్రవేశించినట్లు ఆ దేశం పేర్కొన్నది. రెండు వేవ్‌ల రూపంలో చైనా విమానాలు తమ దేశంలోకి ఎంటర్ అయినట్లు తైవాన్ రక్షణశాఖ చెప్పింది. తమ డిఫెన్స్ జోన్లోకి శుక్రవారం కూడా 38 విమానాలు వచ్చాయని, వాటిల్లో అణ్వాయుధ బాంబర్లు కూడా ఉన్నట్లు తైవాన్ వెల్లడించింది. ప్రజాస్వామ్య తైవాన్ దేశం తమ ప్రాంతమే అని చైనా భావిస్తోంది. కానీ తైవాన్ మాత్రం తనకు తాను వేరు దేశంగా చూసుకుంటోంది. చైనా వైమానిక దళం గత ఏడాది నుంచి చేపడుతున్న మిషన్ల గురించి తైవాన్ ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నది. కావాలనే ఆ దేశం సైనిక దూకుడుకు పాల్పడుతోందని, ప్రాంతీయ శాంతిని ఆ దేశం విచ్ఛిన్న చేస్తున్నట్లు తైవాన్ ప్రధాని సు సెంగ్ చాంగ్ తెలిపారు. శనివారం ఉదయం పూట సుమారు 20 చైనా విమానాలు తైవాన్ డిఫెన్స్ జోన్లోకి చొరబడ్డాయి. ఇక అదే రోజున సాయంత్రం మరో 19 విమానాలు ఎంటర్ అయినట్లు తైవాన్ చెప్పింది. ప్రటాస్ ఐలాండ్ వద్ద పీఎల్ఏ విమానాలు ఎగిరినట్లు తైవాన్ ఆరోపించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
కమీషన్ల కోసమే కొడంగల్-పేట ఎత్తిపోతలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

