టొరంటో: కెనడాలోని స్వామినారాయణ్ ఆలయాన్ని ధ్వంసం చేశారు. భారత్కు వ్యతిరేకంగా ఆ ఆలయంపై రాతలు రాశారు. కెనడాకు చెందిన ఖలిస్తానీ తీవ్రవాదులు ఆ పనిచేసి ఉంటారని భావిస్తున్నారు. ఆలయాన్ని ధ్వంసం చేసిన ఆగంతకులపై చర్యలు తీసుకోవాలని భారత హై కమిషన్ ఓ ట్వీట్లో కోరింది. టొరంటోలో ఉన్న స్వామినారాయణ్ మందిరంపై యాంటీ ఇండియా గ్రాఫిటీ వేసినట్లు ఇండియన్ హై కమిషన్ తెలిపింది. కెనడాలోని హిందూ ఆలయాలపై ఇటీవల వరుసగా దాడులు జరుగుతున్నాయని, ద్వేషపూరిత హింసను అడ్డుకోవాలని, కెనడాలోని హిందువులు ఆందోళన చెందుతున్నట్లు ఎంపీ చంద్ర ఆర్య తెలిపారు.