వాషింగ్టన్: అంతరిక్ష పరిశోధనలో చెరగని ముద్రవేసిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ తన సుదీర్ఘ కెరీర్‌కు ముగింపు పలికారు. నాసాలో 27 ఏండ్లపాటు అసాధారణ సేవలు అందించిన ఆమె, గత ఏడాది డిసెంబర్ 27న పదవీ విరమణ చేశారు. ఈ విషయాన్ని నాసా మంగళవారం అధికారికంగా ప్రకటించింది. వ్యోమగామిగా పలుమార్లు రోదసిలోకి వెళ్లిన ఆమె.. 608 రోజులపాటు అంతరిక్షంలో గడిపి రికార్డ్ సృష్టించారు.