Sam Altman | వాషింగ్టన్, మార్చి 30: చాట్‌జీపీటీలో ఇటీవల అందుబాటులోకి తీసుకొచ్చిన ఇమేజ్ జెనరేటర్ ‘జీబ్లీ’ స్టూడియోకు ప్రపంచవ్యాప్తంగా అనూహ్యమైన ఆదరణ లభిస్తున్నది. దీంతో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్..ఇలా దేంట్లో చూసినా జిబ్లీ ఫొటోలు కనిపిస్తున్నాయి. అయితే, జిబ్లీ ఇమేజ్ జనరేటర్‌ను విస్తృతంగా వాడటం వల్ల తమ ఉద్యోగులకు విశ్రాంతి లేకుండా పోయిందని ఓపెన్ ఏఐ సంస్థ సీఈవో శామ్ ఆల్ట్‌మన్ వాపోయారు.
దయచేసి దీని వాడకాన్ని తగ్గించుకోవాలని నెటిజన్లను ఆయన కోరారు. ‘జిబ్లీ వినియోగం చాలా ఎక్కువగా ఉంది. ఈ విషయంలో యూజర్లు కాస్త కూల్‌గా ఉంటే బాగుంటుంది. మా సిబ్బందికి నిద్ర కూడా అవసరం కదా!’ అని ఆయన అన్నారు. జీబ్లీ ైస్టెల్ ఇమేజ్ జనరేటర్‌ను ‘గ్రోక్’లోనూ యూజర్లు విరివిగా ఉపయోగిస్తున్నారు.