సిడ్నీ, జూన్ 5: భూమికి దాదాపు 1300 కాంతి సంవత్సరాల దూరంలో అసాధారణమైన రేడియో తరంగాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఓ న్యూట్రాన్ నక్షత్రం నుంచి ఇవి వెలువడుతున్నట్టు గుర్తించారు. ఈ నక్షత్రం చాలా నెమ్మదిగా 76 సెకండ్లకు ఒకసారి భ్రమణాన్ని పూర్తిచేస్తున్నదని చెబుతున్నారు.
మీర్ ట్రాప్ పరిశోధన బృందంతో కలసి యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ పరిశోధకులు ఈ తరంగాలను కనిపెట్టారు. అయితే, ఈ తరంగాలను ఏలియన్స్ పంపి ఉండొచ్చని మరికొందరు పరిశోధకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.