Badri Battalion : దేశ రక్షణలో తాలిబాన్ ‘బద్రి 313’.. ఎవరంటే..?
Badri Battalion : ఆఫ్ఘనిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత తాలిబాన్ దేశాన్ని పాలించేందుకు వివిధ చర్యలు తీసుకుంటున్నది. ముఖ్యంగా చేతులెత్తేసిన ఆర్మీ స్థానంలో...

కాబూల్ : ఆఫ్ఘనిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత తాలిబాన్ దేశాన్ని పాలించేందుకు వివిధ చర్యలు తీసుకుంటున్నది. ముఖ్యంగా చేతులెత్తేసిన ఆర్మీ స్థానంలో కొత్త బెటాలియన్‌ను సిద్ధం చేసే పనిలో వారున్నారు. అమెరికా ఫైటర్ల మాదిరి మిలిటరీ యూనిఫాంలు ధరించి అత్యాధునిక ఆయుధాలతో పహారా కాస్తున్నారు. కాబూల్‌ను కంటికి రెప్పలా కాపాడుతున్న ‘బద్రి 313’ బెటాలియన్‌కు సంబంధించిన వీడియోను తాలిబాన్ ప్రచార ఛానళ్లలో అప్లోడ్ చేశారు.
ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమణను సుదీర్ఘకాలం కొనసాగించడానికి తాలిబాన్ ప్రయత్నిస్తున్నది. రాజధాని కాబూల్‌తో పాటు దేశంలోని అన్ని ముఖ్య ప్రాంతాల్లో తాలిబాన్ యోధులను మోహరించారు. ఆఫ్ఘన్, అమెరికన్ దళాల నుంచి పొంచివున్న ముప్పును దృష్టిలో ఉంచుకుని ‘బద్రి 313’ బెటాలియన్‌ను తాలిబాన్ ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక కమాండో తరహా యూనిట్ కాబూల్‌లోని ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ వద్ద మోహరించారు. అలాగే, ముల్లా అబ్దుల్ ఘనీ బరదార్, హిబతుల్లా అఖుంజాదాతోపాటు ఇతర పెద్ద నాయకులు, తాలిబాన్ సీనియర్ నాయకుల భద్రత బాధ్యత వారిపై ఉంచారు.
పూర్తిగా శిక్షణ పొందిన అమెరికన్ ఆయుధాలతో సాయుధులైన ఈ కమాండోలను సోషల్ మీడియా ద్వారా తాలిబాన్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నది. ‘బద్రి 313’ బెటాలియన్ అత్యంత ప్రాణాంతకమైన అమెరికన్ ఎం-4 రైఫిల్, శరీర కవచం, నైట్ విజన్ పరికరాలు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, ఆయుధాలతో సాయుధంగా ఉన్నట్లు చూపిస్తున్నారు.
ఏంటీ వీళ్ల ప్రత్యేకత..
‘బద్రి 313’ కమెండోల వద్ద ఎం-4 రైఫిల్స్ ఉండగా.. సాధారణ జవాన్ల వద్ద ఏకే-47 తుపాకులు ఉన్నాయి. తాలిబాన్ ఫైటర్స్ తలపై టర్బన్ ధరించి కుర్తాపైజామాలో కనిపిస్తుండగా.. ఈ కమెండోలు మిలటరీ యూనిఫాం, హెల్మెట్లతోపాటు నల్లటి చలువ కళ్లద్దాలను ధరించారు. వారిని చూడగానే ఇతర దేశాల కమోండోల మాదిరిగా కనిపిస్తున్నారు. ఈ కమెండోలను సిద్ధం చేయడంలో పాకిస్తాన్ సైన్యం తాలిబాన్‌కు సహాయపడినట్లు తెలుస్తున్నది.
తాలిబాన్ కమెండో యూనిట్‌కు బదర్ యుద్ధం అని పేరు పెట్టారు. ఇది ఖురాన్లో కూడా ప్రస్తావించబడింది. బదర్ యుద్ధంలో ముహమ్మద్ ప్రవక్త 1400 సంవత్సరాల క్రితం కేవలం 313 మంది యోధుల సాయంతో శత్రు సైన్యాన్ని ఓడించారు. అందుకే, తాలిబాన్ తమ ప్రత్యేక కమెండోలకు ‘బద్రి 313’ అని పేరు పెట్టారు.
ఇవి కూడా చదవండి..
గాంధీకి బదులుగా జిన్నాను చంపి ఉంటే… : సామ్నాలో సంజయ్ రౌత్
నిత్యం ఒమేగా ఫ్యాటీ ఆసిడ్స్ తీసుకోవాల్సిందే..! ఎందుకంటే..?
సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా..? అయితే, వీటిని పరిశీలించండి..
4 నిమిషాల్లో 20,000 కేలరీల బర్గర్ హంఫట్..!
ఇస్లాం పరువు తీస్తున్న తాలిబాన్ : సయ్యద్ జైనుల్ అబెదిన్
మణిపూర్ గవర్నర్‌గా లా గణేశన్ నియామకం
లాక్‌డౌన్‌ను నిరసిస్తూ ఆస్ట్రేలియాలో ఆందోళనలు
157 ఏండ్ల క్రితం రెడ్ క్రాస్ సంస్థ ప్రారంభం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

