Elena Huelva | స్పానిష్ ఇన్ఫ్లుయెన్సర్ ఎలెనా హుయెల్వా ఈ నెల 3 వ తేదీన తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆమె కుటుంబీకులు ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆమె అభిమానులకు సమాచారం ఇచ్చారు. ఈ విషయాన్ని ఆన్లైన్ పోర్టల్ E! కూడా నివేదించింది. నవ్వుతూ నవ్విస్తూ తన అనుభవాలను ఆన్లైన్ ద్వారా అభిమానులతో పంచుకుంటున్న ఎలెనా మృతి పట్ల సోషల్ మీడియా మిత్రులు నివాళులర్పించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎలెనాకు 9.92 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు.
20 ఏండ్ల వయసున్న ఈ అమ్మాయి 2019 లో తనకు అరుదైన రకం క్యాన్సర్ ‘ఎవింగ్స్ సార్కోమా’ ఉన్నట్లు నిర్ధారణ అయిందని వెల్లడించింది. గత కొన్ని రోజులుగా తీవ్రంగా అస్వస్థతకు గురయ్యానని చనిపోవడానికి ముందు ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫాలోవర్స్‌కు తెలిపింది. అయితే, ఏనాడూ ఆమె క్యాన్సర్‌తో బాధపడుతున్నా అని గానీ, త్వరలో చనిపోవడం ఖాయం అనిగానీ భయపడలేదు. నవ్వుకు పర్యాయపదంగా నిలిచేలా ఎప్పుడూ అందరితో జాలీగా ఉండే ఎలెనా.. గత నెలలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నానని కూడా తెలిపింది.
చనిపోవడానికి కొన్ని నిమిషాల ముందు.. ‘నేను ఇప్పటికే గెలిచినది మీరు తెలుసుకోవాలని కోరుకుంటున్నా.. ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగుతా..’ అంటూ మెసేజ్ షేర్ చేసింది. ‘ ఈ రోజు ఉదయాన్నే నేను మేల్కొన్నాను. ఇవన్నీ చాలా కష్టతరమైన రోజులు. మరింత క్లిష్టంగా మారుతున్నాయి. నేను బలంగానే ఉన్నాను..’ అంటూ చాలా పొడవైన కథనాన్నే రాసుకొచ్చింది. అదే ఆమె ఆఖరి మెసేజ్. అదే రోజు ఎలెనా కన్నుమూసింది. 2019 నుంచి తనకు బోన్ క్యాన్సర్ అని నిర్ధారణ అయినప్పటి నుంచి ప్రతిరోజు తన అనుభవాలను ఆన్లైన్ పోర్టల్ E! ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా ధారావాహికగా తన ఫాలోవర్స్‌కు చేరవేస్తూ వచ్చింది. తనలో కనిపించిన ‘ఎవింగ్స్ సార్కోమా’ అనే రేరెస్ట్ బోన్ క్యాన్సర్‌ను తన రోలర్ కోస్టర్ అని పేర్కొన్నది.