శనివారం 31 అక్టోబర్ 2020
International - Oct 12, 2020 , 02:55:17

ఎక్కడికైనా గంటలో ఆయుధాలు

ఎక్కడికైనా గంటలో ఆయుధాలు

వాషింగ్టన్‌: ప్రైవేట్‌ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘స్పేస్‌ ఎక్స్‌' వినూత్న ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ప్రపంచంలో ఏ దేశానికైనా గంటలోపల్నే టన్నుల బరువున్న ఆయుధాల్ని తీసుకెళ్లే పునర్వినియోగ రాకెట్‌ను తయారు చేయనున్నది. దీని కోసం అమెరికా సైన్యంతో ఒప్పందం చేసుకున్నది. గరిష్ఠంగా గంటకు 7,500 మైళ్ల దూరం ప్రయాణించే ఈ రాకెట్‌ తొలి ప్రయోగం 2021 మొదట్లో జరుగనున్నది.