వాషింగ్టన్: అమెరికాలోని వాషింగ్టన్లో ఘోర విమాన ప్రమాదం (Airplane Crash) జరిగింది. 64 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ విమానం.. మరో హెలికాప్టర్‌ను ఢికొట్టింది. దీంతో రెండూ పక్కనే ఉన్న పోటోమాటిక్ నదిలో (Potomac River) కూలిపోయాయి. బుధవారం రాత్రి 8.30 గంటల సమయంలో వాషింగ్టన్ సమీపంలోని రోనాల్డ్ రీగన్ నేషనల్ ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండ్ అవుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
పీఎస్ఏ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 60 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బందితో కాన్సాస్‌లోని విషిటా నుంచి బయల్దేరింది. రోనాల్డ్ రీగన్ ఎయిర్‌పోర్టులో దిగేందుకు సిద్ధమవుతుండగా.. రక్షణ శాఖకు చెందిన సికోర్స్కీ హెచ్-60 బ్లాక్‌హాక్ హెలికాప్టర్‌ను ఢీకొట్టింది. దీంతో భారీ శబ్ధంతో అవి రెండూ నదిలో కుప్పకూలాయి. అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఆ విమానాన్ని పీఎస్ఏ నిర్వహిస్తున్నది. సమాచారం అందుకున్న అధికారులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ప్రయాణికుల కోసం నదిలో గాలిస్తున్నారు. కాగా, ఈ ప్రమాదం కారణంగా రోనాల్డ్ రీగన్ విమానాశ్రయాన్ని అధికారులు మూసివేశారు. విమానాల రాకపోకలు నిలిపివేశారు.
Webcam at the Kennedy Center caught an explosion mid-air across the Potomac. https://t.co/v75sxitpH6 pic.twitter.com/HInYdhBYs5
— Alejandro Alvarez (@aletweetsnews) January 30, 2025