వాషింగ్టన్: కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో ఇల్లు దొరకడం చాలా కష్టం. సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ అద్దె నెలకు దాదాపు రూ.3.08 లక్షలు ఉంటుంది. అందుకే కొత్తగా ప్రారంభమైన స్టార్టప్ కంపెనీ బ్రౌన్స్టోన్ షేర్డ్ లివింగ్ వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది. ‘స్లీపింగ్ పాడ్స్’ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. దీనికి నెలకు రూ.63,000 అద్దె వసూలు చేస్తున్నది. కాసేపు కునుకు తీయడానికి స్లీపింగ్ పాడ్ ఉపయోగపడుతుందని చెప్పింది. విమానాశ్రయాలు, కార్యాలయాలు, విశ్వవిద్యాలయాలు వంటి చోట్ల వీటిని ఏర్పాటు చేసింది.