శాంటామారియా: ఊహించని రీతిలో సడెన్గా భూమి కుంగిపోవడం మనం చూస్తూనే ఉంటాం. ఇలాగే మెక్సికోలోని శాంటా మారియా జాకాటెపెక్లోని ఓ పొలంలో భూమి ఉన్నట్లుండి కుంగిపోయింది. మొదట్లో చిన్న సింక్ హోల్ ఏర్పడగా.. అది క్రమంగా పెరుగుతూ వస్తోంది. గత మే నెలలో ఏర్పడిన ఈ సింక్ హోల్ పెరుగుతూ, పెరుగుతూ ఇప్పుడు ఫుట్బాల్ మైదానం కంటే ఎక్కువ ప్రదేశానికి విస్తరించింది. ఇప్పుడీ సింక్ హోల్ ఆ పక్కనే ఉన్న ఇంటిని మింగేయబోతోంది.
మొదట్లో ఆ ఇంటికి చాలా దూరంలో ఇది ఏర్పడినా.. తర్వాత మెల్లగా పెరుగుతూ ఇంటి వరకూ వచ్చేసింది. అందులో ఇప్పటికే రెండు పెంపుడు కుక్కలు పడిపోయాయి. వాటిని ప్రాణాలతో రక్షించాలని అక్కడి జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. మట్టి వదులుగా ఉన్న ప్రాంతాల్లో భూమి ఇలా ఉన్నట్టుండి కుంగిపోతుంది. ఇలాంటి సింక్ హోల్ నుంచి ఆ కుక్కలను రక్షించడం ప్రమాదకరమని అధికారులు చెబుతున్నారు. నాలుగు రోజుల కిందటే ఇవి ఆ సింక్ హోల్లో పడిపోయాయి.
VIDEO: A sinkhole that has been growing dozens of meters daily since last weekend is worrying the residents of a rural area in the Mexican state of Puebla pic.twitter.com/CJlsRjCiOP
— AFP News Agency (@AFP) June 2, 2021