ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో ప్రస్తుతం ఆటవిక పాలన నడుస్తున్నదని మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ గురువారం ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్‌కు ‘ఫీల్డ్ మార్షల్’గా పదోన్నతి లభించడంపై ఎక్స్ పోస్ట్‌లో వ్యంగ్యాస్ర్తాలు సంధించారు.
“జనరల్ అసీం మునీర్‌ను ఫీల్డ్ మార్షల్‌గా చేశారు. నిజాయితీగా చెప్పాలంటే, ‘రాజు’ అనే బిరుదు ఆయనకు కచ్చితంగా సరిపోతుంది. ఎందుకంటే, ప్రస్తుతం దేశం ఆటవిక చట్టం పాలనలో ఉంది. అడవిలో కేవలం ఒకే ఒక రాజు ఉంటాడు’ అని పేర్కొన్నారు.