Britan : క్రిస్మస్ ముందు రోజు బ్రిటన్‌లో విషాదం చోటుచేసుకుంది. ఒక పబ్‌లో సాయుధుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఒక మహిళ చనిపోయింది. ముగ్గురు మగవాళ్లు గాయపడ్డారు. ఊహించని సంఘటనతో అక్కడివాళ్లంతా భయంతో పరుగులు తీశారు. ఇంగ్లండ్‌కు నార్త్‌వెస్ట్‌లో ఉన్న వల్లసే నగరంలోని లైట్ హౌస్ పబ్‌లో ఆర్థరాత్రికి ముందు ఈ సంఘటన జరిగింది. కాల్పులకు పాల్పడిని వ్యక్తిని ఇప్పటి వరకైతే అరెస్ట్ చేయలేదు. ఈ ఘటన వెనక కారణం ఏంటనేది? తెలుసుకునేందుకు మెర్సేసైడ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ‘దర్యాప్తు ఇంకా ప్రాథమిక దశలో ఉంది. క్రిస్మస్కు ముందురోజు ఈ సంఘటన జరగడం చాలా దిగ్భ్రాంతికరం. కాల్పులకు తెగబడ్డ వ్యక్తి ముదురు రంగు మెర్సిడెజ్ కారులో పరారై ఉంటాడని అనుకుంటున్నాం’ అని డిటెక్టివ్ సూపరింటెండెంట్ డేవిడ్ మెక్కౌగ్రెయాన్ వెల్లడించాడు.
కాల్పులకు తెగబడ్డ నిందితుడిని కనిపెట్టేందుకు ఆ సమయంలో పబ్‌లో ఉన్నవాళ్లను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. పబ్‌లోని సీసీ టీవీ పుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. ముదురు రంగు మెర్సిడెజ్ కారు ఆ సమయంలో వెళ్లడం గమనించినవాళ్లు పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరాడు.