టెక్సాస్: అమెరికాలోని టెక్సాస్ స్కూల్లో కాల్పులు జరిపిన 18 ఏళ్ల షూటర్ సాల్వడార్ రామోస్ వాడిన గన్స్ ఫోటోలు ఇవే. షూటర్ తన తుపాకీల చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసినట్లు తెలుస్తోంది. అయితే రాబ్ ఎలిమెంటరీ స్కూల్లో కాల్పులు జరపడానికి మూడు రోజుల ముందు అనుమానిత షూటర్ తన మిత్రుడికి గన్ ఫోటోలను షేర్ చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఏఆర్15 స్టయిల్ రైఫిళ్లను షూటర్ వాడినట్లు పోలీసులు గుర్తించారు. షూటర్ సాల్వడార్‌తో గతంలో చదివిన ఓ క్లాస్‌మేట్‌కు ఈ ఫోటోలను అతను పోస్టు చేశాడు. గన్స్‌తో పాటు తన వద్ద ఉన్న మందుగుండు సామాగ్రి ఫోటోలను కూడా ఆ షూటర్ షేర్ చేశాడు. షూటర్‌తో కలిసి అప్పుడప్పుడు ఎక్స్‌బాక్స్ గేమ్ ఆడేవాడినని అతని మిత్రుడు తెలిపాడు. అప్పుడప్పుడు మెసేజ్‌లు చేసేవాడని, 4 రోజుల క్రితం ఏఆర్ రైఫిళ్ల మెసేజ్ చేశాడని, ఇంకా 5.56 రౌండ్ల బ్యాక్‌పాక్ ఫోటోలను షేర్ చేశాడని చెప్పాడు. అయితే రామోస్ సరైన దుస్తులు వేసుకునేవాడు కాదని, అతని మిత్రులు అతన్ని వేధించేవారని ఆ ఫ్రెండ్ చెప్పాడు. ఫ్యామిలీ ఆర్థిక పరిస్థితి సరిగా లేని కారణంగా అతను సరిగా క్లాసులకు అటెండ్ అయ్యేవాడు కాదని తెలిపాడు. మెల్లమెల్లగా రామోస్ ఓ డ్రాపౌట్ తయారైనట్లు చెప్పాడు. గ్రాడ్యుయేషన్ తర్వాత ఫ్రెండ్షిప్ కట్ అయిందని, కానీ అప్పుడప్పుడు మెసేజ్‌లు చేస్తూ ఎక్స్‌బాక్స్ ఆడమనేవాడని షూటర్ ఫ్రెండ్ తెలిపాడు.
salv8dor ..
ఇన్‌స్టాలో పోస్టు అయిన గన్ ఫోటోలను స్టోరీ బ్యానర్ కింద పోస్టు చేశాడు. దానికి “salv8dor_” అని యూజర్ నేమ్ వాడాడు. మాజీ క్లాస్మేట్స్ అందరూ ఆ అకౌంట్ అనుమానిత గన్‌మేన్ సాల్వడార్ రామోస్దే అని తేల్చారు. రామోస్‌కు టిక్‌టాక్ పేజీ కూడా ఉంది. దాంట్లో సింగిల్ పోస్టు మాత్రమే ఉంది. సబ్వే సర్ఫర్స్ మొబైల్ గేమ్ ఆ క్లిప్‌లో ఉన్నట్లు తేలింది. తన బయో ఫ్రొఫైల్ పిక్చర్ కింద ఓ ట్యాగ్ లైన్ ఉంది. కిడ్స్ బీ స్కేర్డ్ ఇన్ రియల్ లైఫ్ అన్న ట్యాగ్‌ను అతను పోస్టు చేశాడు. ఉవాల్డేలోని రాబ్ ఎలిమెంటరీ స్కూల్లో షూటర్ రామోస్ జరిపిన కాల్పుల్లో 21 మంది మరణించారు. దాంట్లో 18 మంది స్కూల్ పిల్లలు ఉన్నారు. షూటర్ రామోస్‌ను కూడా పోలీసులు షూట్ చేశారు.
రెస్టారెంట్లో ..
షూటర్ సాల్వడార్ రామోస్ స్థానికంగా ఉన్న ఫుడ్ రెస్టారెంట్ వెండీస్లో పనిచేసేవాడు. డే షిఫ్ట్‌లో అతను పనిచేస్తున్నట్లు రెస్టారెంట్ మేనేజర్ చెప్పాడు. అయితే రామోస్ పెద్దగా అందరితో కలిసేవాడు కాదు అని తెలిపాడు. అతనో టైప్ అని, ఎక్కువగా ఏదీ మాట్లాడేవాడు కాదు అని, ఇతర ఉద్యోగులతో అతను సోషలైజ్ అయ్యేవాడు కాదని మేనేజర్ చెప్పాడు. పనిచేసి.. డబ్బులు తీసుకుని వెళ్లేవాడన్నాడు. రామోస్ వ్యక్తిగత విషయాలు తనకు తెలియదన్నాడు. ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అతను ఆ రెస్టారెంట్లో పనిచేసేవాడు. వారానికి అయిదు రోజులు రామోస్ పనికి వచ్చేవాడని తెలుస్తోంది.