అజోర్: అట్లాంటిక్ సముద్రంలో వాహనాలతో వెళ్తున్న ఓ భారీ కార్గో నౌకలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వేలాది వాహనాలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. 22 మంది నౌకా సిబ్బందిని రక్షించారు. పోర్చుగల్‌లోని అజోర్ తీరం సమీపంలో ఈ ఘటన జరిగింది. ఫెలిసిటీ ఏస్ నౌకలో ప్రమాదం జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. జర్మనీలోని ఎమ్డెన్ నుంచి ఈ నౌక బయలుదేరింది. అమెరికాలోని రోడ్ ఐలాండ్‌కు కార్గో నౌక వెళ్తోంది. షిప్లో ఉన్న కార్గో ప్రాంతంలో మంటలు వ్యాపించాయి. రెస్క్యూ ఆపరేషన్ ద్వారా సిబ్బందిని రక్షించారు. 650 అడుగుల పొడుగు, 60 వేల టన్నుల బరువు ఉన్న షిప్లో ఎంత నష్టం వాటిల్లిందో ఇప్పుడే చెప్పలేమన్నారు. ఆ షిప్లో సుమారు 4వేల వాహనాలు ఉన్నట్లు తెలుస్తోంది. దాంట్లో ఖరీదైన 1100 పోర్షే, 189 బెంట్లే కార్లు ఉన్నాయి.