కెనడా: లాటరీలో 3.6 మిలియన్ డాలర్లు గెలుచుకున్న వ్యక్తి ఆ సొమ్మును క్లెయిమ్ చేసుకునేందుకు అవసరమైన గుర్తింపు కార్డులు లేకపోవడంతో తన ప్రియురాలిని నమ్మాడు. ఆ టికెట్ ఆమె చేతికిచ్చి సొమ్ము చేయమన్నాడు. ఆ టికెట్‌ను తీసుకెళ్లి సొమ్ముచేసుకున్న ఆమె మళ్లీ కనిపిస్తే ఒట్టు. మిలియన్ డాలర్ల డబ్బుతో తన తాజా ప్రియుడితో పరారైంది.
కెనడాలోని విన్నిపెగ్‌లో జరిగిందీ ఘటన. లారెన్స్ క్యాంప్‌బెల్ అనే వ్యక్తి 5 మిలియన్ కెనడియన్ డాలర్ల (30 కోట్ల రూపాయలు) లాటరీ టికెట్ కొనగా ఈ అనుభవం ఎదురైంది. డబ్బుతో పారిపోయిన ప్రియురాలి నుంచి తమ సొమ్ము తనకు ఇప్పించాలంటూ న్యాయపోరాటానికి సిద్ధమయ్యాడు. అయితే, తనపై వచ్చిన ఆరోపణలను మెక్కే కొట్టిపడేసింది. కోర్టులోనే తేల్చుకుంటానని తేల్చి చెప్పింది.