కీవ్:రష్యా తాజాగా చేపట్టిన డ్రోన్, మిస్సైల్ దాడుల్లో(Russian Strikes) ఏడు మంది మరణించినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోల్డోమిర్ జెలెన్స్కీ తెలిపారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. ఉక్రెయిన్‌లోని రెండవ పెద్ద నగరమైన ఖార్కివ్‌లో ఉన్న కిండర్గార్డెన్పై అటాక్ జరిగింది. వరుస దాడుల వల్ల కీవ్‌లో కూడా నష్టం జరిగింది. చిన్నారులతో కలిపి సుమారు 26 మంది గాయపడినట్లు జెలెన్స్కీ చెప్పారు. అయితే బుదాపెస్ట్‌లో పుతిన్‌తో జరగాల్సిన భేటీని డోనాల్డ్ ట్రంప్ రద్దు చేసుకున్నారు. ట్రంప్, యూరోప్ నేతలు పిలుపు ఇచ్చినా.. ఫ్రంట్‌లైన్ వద్ద కాల్పులు ఆగడం లేదని రష్యా పేర్కొన్నది.
బ్రియాన్స్క్ బోర్డర్ ప్రాంతంలో ఉన్న రష్యా రసాయనిక ప్లాంట్‌పై ఉక్రెయిన్ మిలిటరీ అటాక్ చేసింది. బ్రిటన్ పంపిన స్టార్మ్ షాడో మిస్సైల్‌తో ఉక్రెయిన్ ఆ దాడిలో పాల్గొన్నది. రష్యా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను చేధించి ఆ స్టార్మ్ షాడో క్షిపణులు విజయవంతంగా దూసుకెళ్లినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. బ్రియాన్స్క్ ప్లాంట్‌లో గన్ పౌడర్, పేలుడు పదార్ధాలు, రాకెట్ తయారీ చేస్తుంటారు.