కీవ్: రష్యా మంగళవారం రాత్రి మళ్లీ ఉక్రెయిన్(Ukraine)పై అటాక్ చేసింది. పశ్చిమ నగరమైన లివివ్‌పై ఆ దాడి జరిగింది. ఆ ఘటనలో ఏడుగురు మృతిచెందారు. పోల్టావా సిటీలో మిలిటరీ ఇన్స్టిట్యూట్పై జరిగిన దాడిలో 50 మంది మృతిచెందిన ఘటన నుంచి ఉక్రెయిన్ తేరుకోకముందే.. రష్యా మరోసారి దాడి చేయడం ఆందోళనకరంగా మారింది. బుధవారం తెల్లవారుజామున డ్రోన్లు, హైపర్సోనిక్ మిస్సైళ్లతో రష్యా దాడి చేసినట్లు లివివ్ సిటీ మేయర్ ఆండ్రీ సదోవ్ తెలిపారు. దేశ రాజధాని కీవ్‌లో కూడా పేలుళ్ల శబ్ధాలు వినిపించాయి. దేశం మొత్తం ఎయిర్ అలర్ట్ జారీ చేసినట్లు ఉక్రెయిన్ మిలిటరీ వెల్లడించింది. లివివ్‌లో డజన్ల సంఖ్యలో జనం గాయపడ్డారు. 50 బిల్డింగ్లు ధ్వంసం అయ్యాయి. దాంట్లో ఇండ్లు, స్కూళ్లు, క్లినిక్‌లు కూడా ఉన్నాయి. పోల్టావా మిలిటరీ ఇన్స్టిట్యూట్లో శిథిలాలను తొలగించే పనిలో రెస్క్యూ వర్కర్లు ఉన్నారు.