Caste Discrimination | కుల వివక్షను నిషేధిస్తూ తీర్మానం.. అమెరికా చరిత్రలోనే తొలినగరంగా నిలిచిన సియాటిల్..!
Caste Discrimination | అమెరికా (America) లోని సియాటిల్ (Seattle) నగరం సంచలన నిర్ణయం తీసుకుంది. నగరంలో కుల వివక్షను (Caste Discrimination) నిషేధిస్తూ తీర్మానించింది. దీంతో అమెరికా చరిత్రలోనే కులవివక్షను నిషేధించిన తొలి నగరంగా (First US City To Ban Caste Discrimination) సియాటెల్ (Seattle) నిలిచింది.
Caste Discrimination | అమెరికా (America) లోని సియాటిల్ (Seattle) నగరం సంచలన నిర్ణయం తీసుకుంది. నగరంలో కుల వివక్షను (Caste Discrimination) నిషేధిస్తూ తీర్మానించింది. దీంతో అమెరికా చరిత్రలోనే కులవివక్షను నిషేధించిన తొలి నగరంగా (First US City To Ban Caste Discrimination) సియాటెల్ (Seattle) నిలిచింది. అసోసియేటెడ్ ప్రెస్ వార్తా సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం..
కుల వివక్ష (Caste Discrimination)ను నిషేధించాలన్న ప్రతిపాదనపై సియాటెల్ నగర కౌన్సిల్లో మంగళవారం ఓటింగ్ జరగ్గా.. 6-1 తేడాతో ఆమోదం పొందింది. ఇండియన్-అమెరికన్ (Indian-American) క్షమా సావంత్ (Kshama Sawant) కౌన్సిల్లో ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు. మంగళవారం జరిగిన నగర కౌన్సిల్ సమావేశంలో ఈ అంశంపై మాట్లాడేందుకు 100 మందికిపైగా గతవారం ప్రారంభంలోనే నమోదు చేసుకున్నారు.
కాగా, ఈ ఆర్డినెన్స్‌కు మద్దతుగా సియాటెల్‌లో, ఇతర ప్రాంతాల్లో దళితులు ర్యాలీలు తీశారని కాలిఫోర్నియాకు చెందిన ఈక్వాలిటీ ల్యాబ్స్ వ్యవస్థాపకుడు తేన్మొళి సౌందరరాజన్ తెలిపారు. అయితే, ఇలాంటి చట్టం చేయడం వల్ల ప్రత్యేకంగా ఓ కమ్యూనిటీని కించపరిచినట్లే అవుతుందని కొందరు హిందూ అమెరికన్లు వాదిస్తున్నారు. కుల వివక్షను నిషేధిస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు మద్దతు పలికిన వారి వాదన మరోలా ఉంది. దేశాల సరిహద్దులు దాటినా కుల వివక్ష తప్పట్లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో ప్రస్తుతం ఉన్న సివిల్ రైట్స్ ప్రొటెక్షన్ చట్టాలలో కుల వివక్ష నుంచి రక్షణ లేదని చెప్పారు. అందుకే ఈ ఆర్డినెన్స్ అవసరం ఉందని, కుల వివక్షకు పాల్పడితే శిక్ష తప్పదనే భయం ఉండాలని చెబుతున్నారు.
Also Read..
Vivek Ramaswamy: అమెరికా అధ్యక్ష అభ్యర్ధి రేసులో వివేక్ రామస్వామి
Joe Biden | ఆ రాష్ట్రాల్లో కొలువులకు డిగ్రీ అక్కర్లేదు.. జో బైడెన్ ఎన్నికల వ్యూహం!
Joe Biden: వాషింగ్టన్ టు కీవ్.. బైడెన్ రహస్య జర్నీ సాగింది ఇలా
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

