నార్విచ్: దుష్ప్రభావాలు లేని కొత్త తరహా క్యాన్సర్ చికిత్సకు యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా శాస్త్రవేత్తలు రూపకల్పన చేస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న క్యాన్సర్ చికిత్సా పద్ధతుల కంటే ఇది కచ్చితత్వంతో, సమర్థంగా పనిచేస్తుందని శాస్త్రవేత్త అమిత్ సచ్దేవా వెల్లడించారు. క్యాన్సర్ కణతి వద్ద మాత్రమే యాంటిబాడీలను యాక్టివేట్ చేసేలా ఈ కొత్త చికిత్సా విధానం ఉంటుందన్నారు. ఎల్ఈడీ లైట్ల ద్వారా ఈ చికిత్స ఉంటుందన్నారు. చర్మ క్యాన్సర్ బాధితుల్లో కణితి కణాలపై దాడి చేసే యాంటిబాడీలను యాక్టివేట్ చేయడానికి చర్మంపైన కాంతిని ప్రకాశింపజేయాలని, ఇందుకు చిన్న ఎల్ఈడీ లైట్లను కణతి వద్దకు పంపాల్సి ఉంటుందన్నారు.