Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Pakistan School: పాకిస్థాన్లోని పెషావర్లో ఉన్న ఓ ప్రైవేటు స్కూల్లో పైకప్పు కూలింది. ఈ ప్రమాదంలో 21 మంది మృతిచెందారు. దీంట్లో 20 మంది విద్యార్థులు, ఓ మహిళా టీచర్ ఉన్నారు.
పెషావర్: పాకిస్థాన్లోని పెషావర్లో ఉన్న ఓ ప్రైవేటు స్కూల్(Pakistan School)లో పైకప్పు కూలింది. ఈ ప్రమాదంలో 21 మంది మృతిచెందారు. దీంట్లో 28 మంది విద్యార్థులు, ఓ మహిళా టీచర్ ఉన్నారు. మృతిచెందిన విద్యార్థుల్లో అబ్బాయిలు, అమ్మాయిలు ఉన్నారు. బాధితుల్లో ఏడు నుంచి 12 ఏళ్ల మధ్య వయసున్న విద్యార్థులు ఉన్నారు. పెషావర్ ఆస్పత్రిలో ప్రస్తుతం ఎమర్జెన్సీ ప్రకటించారు. అల్ ఖైర్ స్కూల్ రూఫ్ కూలినట్లు పెషావర్ డిప్యూటీ కమీషనర్ అఫక్ వాజిర్ తెలిపారు. శిథిలాల కింద విద్యార్థులు చిక్కుకున్నారు. రూఫ్ కూలిన సమయంలో విద్యార్థులు క్లాస్రూమ్ల్లో ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. శిథిలాలను తొలగిస్తున్నారు. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ ఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణ చర్యలకు ఆదేశించారు. విద్యార్థులే మన పెట్టుబడి అని, వాళ్లను కోల్పోవడం తీవ్ర విషాదమే అని ఆయన అన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

