Heavy Rains | మారిన ఎడారి దేశ ముఖచిత్రం..! వర్షాలతో సౌదీ అరేబియా విలవిల..!
Heavy Rains | సౌదీ అరేబియా అనగానే మక్కా, మదీనా, ఎడారి చిత్రాలే కళ్ల ముందు కదలాడుతాయి. కానీ, ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. భారీ వర్షాల కారణంగా వరదలు పోటెత్తుతున్నాయి. మక్కా, మదీనా, జెడ్డా, గవర్నరేట్‌లోని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి.
Heavy Rains | సౌదీ అరేబియా అనగానే మక్కా, మదీనా, ఎడారి చిత్రాలే కళ్ల ముందు కదలాడుతాయి. కానీ, ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. భారీ వర్షాల కారణంగా వరదలు పోటెత్తుతున్నాయి. మక్కా, మదీనా, జెడ్డా, గవర్నరేట్‌లోని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. వర్షాల కారణంగా వరదలు పోటెత్తడంతో భారీగా నష్టం వాటిల్లింది. బుధవారం సైతం వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం హెచ్చరించింది. ప్రస్తుతం, వరదలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సౌదీ అరేబియాలోని మక్కా, మదీనా ముస్లింలకు పవిత్రమైన ప్రార్థనా స్థలాలు. ప్రతి సంవత్సరం హజ్, ఉమ్రా యాత్ర కోసం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ముస్లింలు ఆయా నగరాలకు చేరుకుంటారు.
ప్రస్తుతం భారీ వర్షాలు సౌదీ అరేబియా వాతావరణాన్ని పూర్తిగా మార్చేశాయి. భారీ వర్షాల కారణంగా సౌదీలోని పలు నగరాలు నీట మునిగాయి. మున్ముందు కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరికలు జారీ చేశారు. జాతీయ వాతావరణ కేంద్రం (NMC) ఈ వారంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఉరుములు, తుఫానులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. భారీ వర్షం కురిసేందుకు అవకాశం ఉందంటూ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఈ క్రమంలో ప్రజలు ఇంట్లోనే ఉండాలని.. అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని పరిపాలన హెచ్చరికలు చేసింది. ఎలాంటి ఘటన జరిగినా స్పందించేందుకు అత్యవసర సేవలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొంది. ఇక రాబోయే రోజుల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగనుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. సూచనలు పాటించాలని నిపుణులు సూచించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

