Talibans | ఆఫ్ఘనిస్థాన్ ‘యాక్టింగ్’ ప్రెసిడెంట్‌గా ప్రకటించుకున్న అమ్రుల్లా సలేహ్.. తాలిబన్లపై పంజ్‌షేర్‌లో పట్టు సాధించినట్లు తెలుస్తోంది. దేశమంతా తమ వశమైనా పంజ్‌షేర్ లొంగక పోవడంతో తాలిబన్లు పంతానికి పోయారా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. తాలిబన్లకు మద్దతుగా ఆల్‌ఖైదా ఉగ్రవాదులు కూడా పోరాడుతున్నట్లు సమాచారం. మరోవైపు పాక్ గుడాఛార సంస్థ ఐఎస్ఐ కూడా వీరికి సహకరిస్తున్నట్లు తెలియవచ్చింది.
శుక్రవారం జరిగిన చర్చలు విఫలం కావడంతో పంజ్‌షేర్‌పై పట్టు సాధించడం కోసం తాలిబన్లు భారీగా తరలి వెళ్లారు. పంజ్‌షేర్ వ్యాలీలో అడుగు పెట్టగానే సాలేహ్ సారధ్యంలో నార్తర్న్ అలయెన్స్ బలగాలు చుట్టుముట్టాయి. బుల్లెట్ల వర్షం కురిపించాయి. రాకెట్ లాంచర్లు ప్రయోగించి తాలిబన్ల యుద్ధ ట్యాంకులను పేల్చేశాయి. పంజ్‌షేర్‌లోని నార్తర్న్ అలయెన్స్ బలగాలు 450 మంది తాలిబన్లను హతమార్చారు.