లండన్: ఉక్రెయిన్‌తో జరిగిన యుద్ధంలో సుమారు 50 వేల మంది రష్యా సైనికులు(Russian Soldiers) మృతిచెందినట్లు తెలుస్తోంది. యుద్ధం ప్రారంభమైన రెండో సంవత్సరం.. రష్యా సైనికుల మరణాల సంఖ్య.. తొలి సంవత్సరంతో పోలిస్తే 25 శాతం ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఓ అంతర్జాతీయ మీడియా సంస్థతో పాటు మరికొన్ని గ్రూపులు నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ విషయం తెలిసింది. 2022 ఫిబ్రవరి నుంచి చోటుచేసుకున్న మరణాలను ఆ సంస్థలు నమోదు చేస్తున్నాయి. కొత్తగా నిర్మించిన శ్మశానవాటికల ద్వారా సైనికులను గుర్తించడం జరిగింది. ఉక్రెయిన్‌తో జరిగిన వార్‌లో రెండో ఏడాది సుమారు 27, 300 మంది సైనికులు మృతిచెందారు. అధికారికంగా రష్యా చెప్పిన వివరాలతో పోలిస్తే, మరణాల సంఖ్య 8 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. రష్యా ఆక్రమిత డోనస్కీ, లుహాన్స్కీల్లో జరిగిన మరణాలను దీంట్లో లెక్కించలేదు. రష్యాతో జరుగుతున్న యుద్ధంలో 31వేల మంది ఉక్రెయిన్ సైనికులు మృతిచెందినట్లు అధ్యక్షుడు జెలెన్స్కీ ఇటీవల తెలిపారు.