Russian President: 17 ఏళ్ల క్రితం నాటి ఘటనకు క్షమాపణలు చెప్పిన రష్యా అధ్యక్షుడు
Russian President: మెర్కల్తో జరిగిన మీటింగ్‌కు పుతిన్ తన పెంపుడు కుక్కను తీసుకొచ్చారు. 17 ఏళ్ల క్రితం జరిగిన ఆ ఘటన తనను ఇబ్బందిపెట్టినట్లు ఇటీవల ఓ బుక్‌లో మెర్కల్ రాశారు. అయితే ఆ ఘటన పట్ల పుతిన్ ఇవాళ క్షమాపణలు చెప్పారు.
మాస్కో: రష్యా అధ్యక్షుడు(Russian President) వ్లాదిమిర్ పుతిన్.. జర్మనీ మాజీ ఛాన్సలర్ ఏంజిలా మెర్కల్‌కు క్షమాపణలు చెప్పారు. 17 ఏళ్ల క్రితం జరిగిన ఆ ఘటనపై ఆయన పశ్చాతాపం వ్యక్తం చేశారు. 2007లో సోచి నగరంలో జరిగిన ఓ మీటింగ్‌కు మెర్కల్ హాజరయ్యారు. అయితే ఆ మీటింగ్‌కు పుతిన్ పెంపుడు శునకం లాబ్రడార్ కోని కూడా వచ్చింది. మెర్కల్ కూర్చున్న కుర్చీ చుట్టూ ఆ శునకం పహారా కాసింది. ఆ సమయంలో మెర్కల్ కాస్త ఆందోళనకు గురయ్యారు. కుక్కలకు భయపడే మెర్కల్ ఆ ఘటన పట్ల సీరియస్ అయ్యారు. ఇటీవల ఫ్రీడమ్ అనే టైటిల్‌తో మెర్కల్ ఓ పుస్తకాన్ని రాశారు. దాంట్లో ఆ ఘటన గురించి ఆమె ప్రస్తావించారు. పుతిన్ పెంపుడు కుక్క వల్ల తాను చాలా ఇబ్బందిపడినట్లు పేర్కొన్నారు. తనను బెదిరించేందుకు పుతిన్ ఆ పని చేశారని మెర్కల్ తన బుక్‌లో తెలిపారు. ఆ ఘటన పట్ల గురువారం పుతిన్ మరోసారి క్షమాపణలు చెప్పారు.
నిజానికి మెర్కల్‌కు కుక్కలు అంటే భయం. 1995లో ఆమెను ఓ శునకం కరిచింది. అప్పటి నుంచి ఆమె కుక్కలకు భయపడుతోంది. కానీ పుతిన్‌ను కలిసిన సమయంలో.. ఆ మీటింగ్‌కు పెంపుడు కుక్క రావడంతో ఆమెకు భయమేసింది. తాను భయపడుతుంటే ఆ ఘటన చూసి పుతిన్ ఎంజాయ్ చేసినట్లు ఆమె ఆరోపించారు. ఆ ఘటన పట్ల గతంలోనే క్షమాపణలు చెప్పినట్లు కజకిస్తాన్‌లో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పుతిన్ తెలిపారు. మెర్కల్‌కు కుక్కలంటే భయమన్న విషయం తెలియదని, లేదంటే ఆ రోజు అలా జరిగేది కాదు అని పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

