మాస్కో: రష్యాలో అంగారా ఎయిర్‌లైన్స్ ప్రయాణికుల విమానం గురువారం చైనా సరిహద్దులోని టిండా పట్టణంలో కూలిపోయింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్‌తో విమానం సంప్రదింపులు కోల్పోయిన కొన్ని నిమిషాలకే ఈ విమానం కూలిపోయింది. రెస్క్యూ సిబ్బంది కాలిపోతున్న విమాన ప్రధాన భాగాలను గుర్తించారు. ప్రాథమిక విశ్లేషణ ప్రకారం పైలట్ ల్యాండింగ్‌కు ప్రయత్నించినప్పుడు తక్కువ దృశ్యత(విజిబిలిటీ) కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.
రెండోసారి ల్యాండింగ్‌కు పైలట్ ప్రయత్నించినప్పటి నుంచి అది రాడార్‌కు చిక్కకుండా పోయినట్లు తెలుస్తున్నది. ఈ విమానం యాభై ఏండ్ల పాతది. 43 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్న ఈ విమానం బ్లాగోవెష్చెన్స్ నుంచి టిండాకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.