కీవ్, మార్చి 6: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సొంత పట్టణంలోని ఓ హోటల్‌పై రష్యా జరిపిన బాలిస్టిక్ క్షిపణి దాడిలో నలుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారని ఆ దేశ వైమానిక దళం తాజాగా తెలిపింది. బాలిస్టిక్ మిస్సైల్ ఇస్కందర్‌ను మధ్య ఉక్రెయిన్‌లోని కివియా రీహ్‌లో ఓ హోటల్‌పై రష్యా ప్రయోగించింది.
క్షిపణి దాడికి కొద్ది గంటల ముందు మానవతా సహాయక సంస్థ వలంటీర్లు ఆ హోటల్లో దిగారని జెలెన్స్కీ చెప్పారు. ఉక్రెయిన్‌లోని వివిధ పట్టాణాలపై రష్యా తాజాగా డ్రోన్, క్షిపణి దాడులతో విరుచుకుపడింది. 112 షాహెడ్, డెకాయ్ డ్రోన్లను, రెండు బాలిస్టిక్ ఇస్కందర్ మిస్సైల్స్‌ను ప్రయోగించినట్టు ఉక్రెయిన్ వైమానికదళం ప్రకటించింది.