Russia Invansion | ఉక్రెయిన్‌పై దండయాత్ర చేసిన రష్యా దూకుడు పెంచింది. ఉక్రెయిన్ సరిహద్దులకు రష్యా సైనిక అధికారులు అణ్వాయుధాలను తరలిస్తున్నారు. బెలారస్లో రష్యా రక్షణ బలగాలు క్షిపణులను మోహరించాయి. మరోవైపు బెలారస్‌పై అమెరికా, యూరోపియన్ యూనియన్ (ఈయూ) ఆంక్షలు విధించాయి. బెలారస్లో ఎంబసీ కార్యకలాపాలు సస్పెండ్ చేసినట్లు అమెరికా ప్రకటించింది. రష్యా నుంచి దౌత్య సిబ్బందిని అమెరికా వెనక్కి రప్పిస్తున్నది. రష్యాలో ఉన్న అమెరికన్లు తక్షణం వెనక్కు వచ్చేయాలని వైట్‌హౌస్ ఆదేశించింది.
ఈయూ దేశాల వ్యూహానికి రష్యా కూడా కౌంటర్‌గా సమాధానాలు చెబుతున్నది. బ్రిటన్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, కెనడా తదితర 36 దేశాల విమానాలపై రష్యా నిషేధం విధించింది. ఇదిలా ఉంటే, బెలారస్లో రష్యా, ఉక్రెయిన్ మధ్య జరిగిన తొలి శాంతి చర్చలు విఫలం అయ్యాయి. రష్యా తక్షణం యుద్ధం విరమించాలని ఉక్రెయిన్.. నాటోలో చేరబోమని ఉక్రెయిన్ రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని రష్యా డిమాండ్ చేయడంతో చర్చలు ఫెయిలయ్యాయి.